a-big-breakfast-daily-may-help-you-stay-slim

Hello Vewers Welcome to MMS DESIGNER.
మీ నడుము చుట్టూ ఉన్న కొవ్వు ని కరిగించాలని మీరు అనుకుంటున్నారా ? అలా అయితే మీరు ప్రొదున్నే తీసుకునే ఆహారం, మిగతా రోజులో తీసుకునే ఆహరం కంటే ఎక్కువగా తీసుకోగలిగితే మీ శరీర బరువుని తగ్గించుకొని, మీ శరీరాకృతిని మీకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఒక అధ్యయనం ప్రకారం, ఒక రోజులో ఎవరైతే మూడు సార్లు కంటే ఎక్కువగా ఆహారం తీసుకుంటారో, రాత్రిపూట తినే భోజనం మిగతా రోజులో తీసుకునే ఆహారం కంటే ఎక్కువగా ఉంటుందో, అలాంటి వ్యక్తుల యొక్క శరీరతత్వం ఉండవలసిన దానికంటే అధికంగా ఉంటుంది. అంతే కాకుండా ఇలాంటి వ్యక్తులు అనేక రకాలైన వ్యాధుల భారినపడే అవకాశం ఎక్కువ. ప్రొదున్నే అల్పాహారం తీసుకోవడం, మధ్యాహ్నం భోజనం చేయడం, రాత్రిపూట భోజనం అస్సలు చేయకపోవడం, చిరు తిండ్లకు దూరంగా ఉండటం, ప్రొదున్నపూట అల్పాహారం ఎక్కువ తీసుకోవడం మరియు రాత్రిపూట భోజనం చేయకుండా 18 గంటల పాటు ఉపవాసం ఉండటం అనే ఈ చర్య బరువు నిర్వహణ వ్యూహంలో ఒక భాగం అని చెబుతున్నారు కాలిఫోర్నియా లోని ఒక విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. వీళ్ళు చెప్పేది పురాతన కాలంలో చెప్పిన సామెతను నిజం చేస్తుంది. అదేమిటంటే " ఒక రాజులాగా ప్రొదున్న అల్పాహారం తీసుకో, ఒక రాకుమారుడులాగా మధ్యాహ్నం భోజనం చేయి, రాత్రిపూట ఒక బిచ్చగాడిలా భుజించు ." ఈ అధ్యయనంలో దాదాపు 50 వేల మంది పాల్గొన్నారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వ్యక్తుల భోజనం తీసుకునే క్రమం ఎలా ఉన్నా, సగటున వారి యొక్క వయస్సు 60 సంవత్సరాలు చేరే వరకు ప్రతి సంవత్సరం వారి బరువు పెరుగుతూనే ఉంది. 60 యేళ్లు దాటిన తర్వాత వాళ్ళ బరువు సంవత్సర సంవత్సరానికి తగ్గిపోతోంది అనే విషయాన్ని అధ్యయనంలో గుర్తించారు. 60 యేళ్ళ కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు ప్రొదున్నపూట తీసుకునే ఆహరం వల్ల బరువు పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఇదే విషయమై, 60 సంవత్సరాలు దాటిన వారిని గనుక గమనిస్తే సగటున కోల్పోయే బరువు కంటే కూడా ఎక్కువ బరువును కోల్పోతున్నారు. "కొన్ని సంవత్సరాలు ఈ మొత్తం ప్రభావం అనేది ఇలానే ఉండటం చాలా ముఖ్యం" అని చెబుతున్నారు పరిశోధకులు.
Disclaimer +
ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి MMS DESIGNER (Health tips) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా video lo ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు
