How to overcome loneliness feeling in telugu

MMS Designer
MMS Designer
Sep 10, 2026

Hello Viewers Welcome to MMS DESIGNER.

మన జీవితకాలంలో ఏదోక ఒకసారి ఒంటరిగా ఉన్నాం అన్న భావనకు గురవుతుంటాము అవునా! చుట్టూ వందలాది జనం ఉన్న కూడా ఒంటరిని అన్న భావన మనలో కలుగుతుంది. అలా అనిపించుటకు కారణాలేంటో మీరే తెలుసుకోండి.
అధికంగా ఆశించటం
అధికంగా ఆశించటం వలన కూడా మనం బాధపడాల్సి వస్తుంది మరియు ఒంటరిగా ఉన్నాం అన్న భావనకు కూడా లోనవుతాము. మీ సామర్థ్యానికి మించిన ప్రతిఫలం ఆశించి ఎక్కువగా ప్రయత్నించటం వలన మీరు ఎక్కడికో చేరుకుంటారు, ఫలితంగా మీరు వెళ్ళే దారిలో ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వస్తుంది.
స్వీయ తక్కువగా అంచనా
మీ శక్తి మరియు సామర్థ్యం తెలియక పోవటం వలన మీపై మీరే విశ్వాసం కోల్పోతారు. ఇతరులతో పోలుస్తూ స్వతహాగా తక్కువ అంచనా వేసుకోవటం వలన ఒంటరిని అన్న భావనకు లోనయ్యే అవకాశం ఉంది. దీని వలన మీ కుటుంబం మరియు స్నేహితులు మద్దతు తెలిపిన మీరు ఒంటరిని అన్న భావనకు లోనయ్యే అవకాశం ఉంది.
సంబంధాలలో ఉండే భాదలు
మన ఆత్మీయుల ఉండే సంబంధం చివరి రోజుకు చేరుకోగానే మనందరికీ బాధగానే ఉంటుంది. విడిపోయిన బంధం వలన మన మనసు ఒంటరి అన్న భావనకు గురవుతుంది మరియు ఈ స్థితి కోలుకోటానికి సమయం పడుతుంది. కుటుంబ కారణాల వలన లేదా నమ్మక ద్రోహం వంటి కారణాల ఫలితంగా ఒక స్నేహితుడిని కోల్పోవటం లేదా అతడు/ఆమె తో ఉన్న బంధాన్ని కోల్పోవటం వలన చుట్టూ ఎంత మంది ఉన్న మనం ఒంటరి అనే భావన వెంటాడుతూనే ఉంటుంది
అహంకారం
అహంకారం అనేది మంచి విషయమే కానీ, మీ సొంత నిర్ణయాల పట్ల అహంకారంగా వ్యవహరించటం లేదా ఇతరులపై ఆధిపత్యం చేలాయించతానికి అహంకారంగా వ్యవహరించటం మంచిది కాదు. చుట్టూ ఉండే వారు ఇలాంటి వారికి దూరంగా ఉండటం లేదా వారితో మాట్లాడకపోవటం వంటి చేయవచ్చు. చివరకి, మీతో ఉండటానికి ఎవరు ఇష్టపడరు మరియు ఉండలేరు.
ఎలా విముక్తి పొందాలి?
ఒంటరితనం అనేది ఒక ఉచ్చు లాంటిది! దీని నుండి భయట పడటానికి కృషి, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం చాలా అవసరం. సంఘీక ఒంటరితనం నుండి విముక్తి పొందుటకు వాలేంటీర్లుగా పాల్గొనండి లేదా సాంఘీక కార్యకలాపాలలో స్వతహాగాపాల్గొనండి లేదా మీరు చేసే కార్యాలలోనే ఆనందాన్ని పొందండి. మీరు నిరాశ, నిస్పృహ మరియు ప్రతికూల ఆలోచనల నుండి బయటకు రావటానికి ప్రయత్నించండి