hair fall control tips and suggestion in telugu

MMS Designer
MMS Designer
Sep 10, 2026

Hello Viewers Welcome To MMS DESIGNER.
వయసు మరియు లింగంతో సంబంధం లేకుండా జుట్టు రాలటం అనేది చాలా మందిలో సాధారణమైపోయింది. వెంట్రుకలు రాలే ప్రక్రియను తగ్గించుటకు గానూ తలపై చర్మం మరియు జుట్టుపై ప్రత్యేక శ్రద్దను, తగిన జాగ్రత్తలను తీసుకోవాలి.
ఆహారం మరియు పోషణ
జుట్టు రాలటాన్ని తగ్గించుటకు గానూ మొదటగా తినే ఆహార పదార్థాల పైన ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలి. మీరు తినే ఆహరంలో శరీరానికి కావలసిన విటమిన్ 'A', సంక్లిష్ట విటమిన్ 'B', 'C' మరియు 'E' లతో పాటుగా తగిన మొత్తంలో ప్రోటీన్, కాల్షియం, జింక్, మరియు ఐరన్ మూలకాలు ఉన్నాయా? అని చూసుకోండి. పోషకాహార నిపుణులను కలిసి, జుట్టు రాలకుండా ఉండటానికి మరియు ఆరోగ్యం మెరుగుపడటానికి కావలసిన పోషకాలు ఉండేలా ఆహార ప్రణాళికను తయారు చేసుకోండి. సాధారణంగా, అల్పాహారంలో పాలు మరియు గుడ్లులతో పాటుగా మధ్యాన్న భోజనంలో లీన్ మీట్ మరియు గ్రీన్ సలాడ్ వంటి వాటి నుండి కావలసిన పోషకాలు అందించబడతాయి. వీటితో పాటుగా మధ్యలో పండ్లు మరియు నట్స్ లను స్నాక్స్ గా తీసుకోండి. రాత్రి భోజనంలో కొద్ది మొత్తంలో లీన్ ప్రోటీన్ లతో పాటుగా కూరగాయాలను తినాలి మరియు శరీరాన్ని హైడ్రేటేడ్ ఉంచుకోటానికి ఎక్కువగా నీటిని తాగండి.

కెఫిన్, ఆల్కహాల్ & నికోటిన్
ఈ మూడు రకాల అలవాట్లు మీ జుట్టు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావిత పరుస్తాయి. కెఫిన్ ఆల్కహాల్ & సిగరెట్ వంటి వాటి వలన ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారని కొంత మంది అభిప్రాయం. కానీ, వీటి వలన శరీరంలో తగ్గే సమస్యల కంటే, పెరిగే సమస్యలే ఎక్కువ. వీటి వలన జుట్టు రాలే ప్రక్రియ అధికం అవుతుంది కావున, ఈ అలవాట్లకు దూరంగా ఉండండి.

ఒత్తిడి
జుట్టు రాలటానికి గల ముఖ్య కారణం- ఒత్తిడి. ముఖ్యంగా, ఒత్తిడి వలన జుట్టు రాలటం ఎక్కువగా ఉంటే మాత్రం, ఒత్తిడిని అధిగమించి, ప్రశాంతతను అందించే పద్దతులను అనుసరించాలి. ధ్యానాన్ని అనుసరించటం ద్వారా ఒత్తిడికి దూరంగా ఉండవచ్చు, సాంఘీక కార్యకలాపాలలో పాల్గొంటూ కుడా ఒత్తిడికి దూరంగా ఉండండి.


వ్యాయామాలు
రక్త ప్రసరణ ఆరోగ్యకర స్థాయిలో ఉంటే జుట్టు పెరుగుదల మరియు వాటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రోజు కేవలం 30 నిమిషాల వ్యాయామాల మన ఆరోగ్యంతో పాటు, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఒకవేళ వైద్యపరంగా భౌతిక కార్యకలాపాలకు వ్యతిరేఖంగా ఉంటే వెంటనే యోగా లేదా కొద్ది దూరం నడవటం వంటి వాటిని అనుసరించండి.

జాగ్రత్తలు తీసుకోండి
శరీర అంతర్గత పరంగా జాగ్రత్తలు తీసుకోవటం ప్రారంభించిన తరువాత బహిర్గతపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవటం అనుసరించాలి. కఠినమైన షాంపూ మరియు కండిషనర్ లను వాడకూడదు. ఒకవేళ తేలికపాటి షాంపూలు లభించని ఎడల, గాడతలు తక్కువగా ఉండే చిన్న పిల్లలకు వాడే షాంపూలను వాడండి. అంతేకాకుండా, ఎక్కువ సమయం కాలుష్య వాతావరణంలో కేటాయిస్తే, ఇంటికి రాగానే తలపై చేరిన దుమ్ము, ధూళిలను నీటితో కడిగి తొలగించుకోండి. ఇలా చేయని ఎడల జుట్టు తీవ్ర ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. జుట్టు సంరక్షణ ఉత్పత్తులు మరియు స్టైలింగ్ కు వాడే ఉత్పత్తులు చాలా వరకు రసాయనాలను కలిగి ఉంటాయి. పురుషులు జెల్ వాడకానికి బదులుగా బీస్ వ్యాక్స్ లను ఉపయోగించండి. స్త్రీలు, స్ప్రే లేదా ఇతర ఉత్పత్తులను
వాడకూడదు. రంగులు లేదా డైలకు బదులుగా వెంట్రుకలకు కావలసిన పోషకాలను అందించే సహజ నూనెలను వాడండి. శుద్దమైన మరియు దంచిన గోరింట ఆకులు లేదా హెన్నను వాడటం వలన జుట్టుకు సహజ ఎరుపుదనంతో పాటుగా, సహజ కండిషనర్ లాగా పని చేస్తుంది.

హార్మోన్లు
హార్మోన్ల అసమతుల్యతలు కలిగి ఉన్న వారు లేదా కుటుంబంలో ఆండ్రోజెన్ అలోపేసియా చరిత్ర కలిగిన పురుషులలో జుట్టు రాలటం ప్రారంభమయ్యే ముందు లేదా లక్షణాలు బహిర్గతమయ్యే ముందు వైద్యుడిని కలిసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యులు తగిన పరీక్షలు జరిపి, జుట్టు రాలటాన్ని నివారించే పద్దతుల గురించి సలహా ఇస్తారు.
Disclaimer +
ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి MMS DESIGNER (Health tips) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా video lo ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు