Your stomach Foods that increase belly fat in telugu

MMS Designer
MMS Designer
Sep 10, 2026

Hello Viewers Welcome To MMS DESIGNER.
మీ పొట్టను పెంచే చెడు అలవాట్లు
ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమె కాకుండా కొన్ని రకాల చెడు అలవాట్లు కూడా శరీర బరువును ప్రభావిత పరుస్తాయి. అవును, కొన్ని అలవాట్లు శరీర బరువును పెంచి, నడుము చుట్టూ కొవ్వు పదార్థాలు పెరుగుకుపోయేలా చేస్తాయి. ఆ అలవాట్ల గురించి కింద పేర్కొనబడింది.
పొట్ట చుట్టూ కొవ్వుమీ బరువు నిర్వహణలో విఫలం అవుతున్నారని తెలిపేది- పొట్ట చుట్టూ ఏర్పడే కొవ్వు. పొట్టను తగ్గించుకోవటానికి చాలా రకాల వ్యాయామాలను మరియు ఆహార ప్రణాలికలను మార్చినప్పటికీ, మీ పొట్ట తగ్గటం లేదా! దీనికి కారణం మీ అలవాట్లు అని చెప్పవచ్చు. పొట్ట పెరగానికి గల సాధారణ కారణాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
దాహంగా ఉన్నపుడు సోడా చాలా మంది దాహంగా అనిపించినపుడు ఎక్కువ శాతం, చక్కెర ద్రావణాలను లేదా సోడా వంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు వలన నడుము చుట్టూ కొవ్వు అలాగే ఉంటుంది. చాలా వరకు ఈ ద్రావణాలు చక్కెరలను కలిగి ఉండి, ఆకలిని పెంచి, అధిక ఆహార సేకరణను ప్రోత్సహిస్తాయి. దాహంగా అనిపించినపుడు పోషకాలు ఎక్కువగా ఉన్న ద్రావణాలను లేదా నీటిని తాగండి
ప్లేట్ నిండా ఆహారం
పొట్ట తగ్గకపోవటానికి ముఖ్య కారణం- ప్లేట్ నిండా ఆహారం అని చెప్పవచ్చు. ఇలా అధికంగా ఆహారం మీ ముందు ఉండటం వలన శరీరానికి కావలసిన దాని కంటే ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. ఫలితంగా, శరీరంలో కొవ్వు పదార్థాల నిల్వ అధికం అవవచ్చు. కావున చిన్న ప్లేట్ లో మీకు కావలసిన మేరకు మాత్రమె పెట్టుకోండి.
రాత్రి సమయంలో ఆలస్యంగా తినటంనిద్రపోయిన సమయంలో, మన శరీరంలో కొవ్వు పదార్థాలు వినియోగించబడతాయి. రాత్రి సమయంలో ఆలస్యంగా తినటం వలన ఈ ప్రక్రియకు అడ్డంకులు ఏర్పడటమే కాకుండా, కొవ్వు పదార్థాల వినియోగానికి సమస్యలు కలుగుతాయి. అంతేకాకుండా, ఆలస్యంగా పొట్టనిండా తినటం వలన ఆసిడ్ లు ఎక్కువ విడుదల అవటం లేదా అజీర్ణానికి దారి తీయవచ్చు.
అల్పాహారం మానటం
మన శరీరానికి అల్పాహారం చాలా ముఖ్యం అని చెప్పవచ్చు. అల్పాహారాన్ని మరచినట్లయితే, మధ్యాన్న భోజనంలో ఆహారం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. ఫలితంగా శరీరంలో కొవ్వుపదార్థాలు అధికమై, పొట్ట చుట్టూ పేరుకుపోయే అవకాశం ఉంది. కావున ఎప్పటి ఆహారాన్ని అపుడే తినటానికి ప్రయత్నించండి.
భావోద్వేగాల సమయంలో ఆహారం
భాద, సంతోషం లేదా కోపానికి గురైన సమయంలో ఎక్కువ ఆహరం తీసుకోవటం వలన మీ భాద్వేగాల నుండి భయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ దీని వలన పొట్ట చుట్టూ కొవ్వు చేరే అవకాశం ఉంది. ఇలా భావోద్వేగాలకు గురైన సమయంలో స్నేహితులతో మాట్లాడటం లేదా గ్లాసు నీటిని తాగటం వంటి వాటిని చేయండి.
రాత్రి ఆలస్యంగా పడుకోవటం
నిద్రలోపం వలన శరీర బరువు పెరిగే అవకాశం ఉంది. నిద్ర సరిపోకపోవటానికి కారణం, రోజు రాత్రి ఆలస్యంగా పడుకోవటం. నిద్రాలోపాల వలన శరీరంలో 'కార్టిసాల్' హార్మోన్ విడుదల అధికమై, ఆకలిని పెంచటం మూలంగా ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటారు. 7 నుండి 9గంటల పాటూ నిద్ర తప్పని సరి అవసరం.
ఎక్కువగా తాగటం వలనఅధికంగా ఆల్కహాల్ తాగటం వలన కూడా పొట్ట పెరిగే అవకాశం ఉంది. ఆల్కహాల్ నుండి శరీరానికి అధిక మొత్తంలో క్యాలోరీలు అందించబడి, కొవ్వు పదార్థాలు పేరుకుపోయి, శరీర బరువును పెంచుతాయి. కావున, తగిన స్థాయిలో మాత్రమె తాగటం మంచిది.
Disclaimer +
ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి MMS DESIGNER (Health tips) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా video lo ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు