home remedy itchy ears how to cure in telugu

Hello Vewers Welcome to MMS Designer.
చెవిలో దురదలను త్వరితంగా తగ్గించే ఔషదాలు
చెవిలో దురదలు చాలా ఇబ్బందులతో పాటూ, చెవి నొప్పితో ఇతరేతర ఆరోగ్య సమస్యలకి కారణమవుతాయి. వీటిని త్వరితంగా తగ్గించే ఇంట్లో ఉండే ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.
చెవిలో దురదలు
చెవిలో దురదలతో సమస్యలు ఎదుర్కొంటున్నారా? సహజ ఔషదాలు సమర్థవంతంగా ఈ సమస్య నుండి ఉపశమనం కలిగిస్తాయి. చెవిలో కలిగే ఈ దురదలు, చెవిపై ప్రాంతపు చర్మంపై ఇన్ఫెక్షన్ గా మారి, నొప్పి, జ్వరం, వాసనతో కూడిన ద్రవాల భయటకు రావటం లేదా చెవిగులిమి వంటి వాటికీ కారణం అవుతాయి. ఇలాంటి సమస్యల నుండి త్వరగా ఉపశమనం పొందుటకు ఈ ఔషదాలను వాడండి.
చెవిని శుభ్రంగా ఉంచుకోడి
చెవులను శుభ్రంగా ఉంచుకోవటం వలన చెవిలో కలిగే అవాంఛిత అనుభూతులను దూరంగా ఉండవచ్చు. రోజు చెవిని శుభ్రం చేసుకోవటం వలన చెవిగులిమి ఏర్పడదు మరియు చెవి సంబంధిత సమస్యలకు దూరంగా ఉండవచ్చు.
చెవిలో నుండి తేమను తొలగించటం
ఈత కొట్టడం వలన చెవిలో తేమ నిక్షిప్తం అవుతుంది. ఇలాంటి వాటిని తొలగించుటకు, స్నానం లేదా ఈతకొట్టే సమయంలో అయిన చెవిలో నీరు చేరకుండా చూసుకోవాలి. ఇలా చెవిలో నీరు చేరి, తేమగా మారటం వలన బ్యాక్టీరియ మరియు ఫంగస్ పెరిగి చెవిలో దురదలకు కారణమవుతాయి.
ఆలివ్ ఆయిల్
చెవి దురదగా ఉన్నపుడు రోజులో 3 సార్లు ఆలివ్ ఆయిల్ ను చుక్కలుగా వేసుకోవాలి. మరింత శక్తివంతమైన ఔషదం కోసం ఆలివ్ ఆయిల్ కు దంచిన అల్లంను కలిపి, వేడి చేయండి. గది ఉష్ణోగ్రతకు చల్లార్చిన తరువాత, ఈ ఔషదాన్ని వాడండి.
వేడి నీటి బాటిల్
కొన్ని సార్లు, చెవిలో చెవిగులిమి ఏర్పాటు కారణంగా, దురదలు ఎక్కువ అవుతాయి. వేడి నీటిని మీ చెవి ప్రాంతంలో ఉంచటం ద్వారా చెవిలో ఏర్పడిన గులిమిని తొలగించుకోండి. నీటి బాటిల్ నుండి వచ్చే వేడి వలన గులిమి కరిగి, భయటకు రావటం వలన చవి శుభ్రంగా మారుతుంది
Disclaimer +
ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి MMS DESIGNER (Health tips) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా video lo ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు
