How to Remove Blackheads in telugu

Hello Viewers Welcome to MMS DESIGNER.
బ్లాక్ హెడ్స్ తో టీనేజ్ మూడ్ ఆఫ్: చిట్కాలు బ్లాక్ హెడ్స్ తో టీనేజ్ మూడ్ ఆఫ్: చిట్కాలు ముఖం మీద చిన్న చిన్న నల్లటి మచ్చలు..ఇవంటే అమ్మాయిలకే కాదు, అబ్బాయిలకు కూడా హాడలే. ఇది ముఖాలను అందవిహీనంగా చేయటమే కాదు..కొన్ని సార్లు మానసికంగా కూడా క్రుంగదీస్తాయి. వీటినే బ్లాక్ హెడ్స్ అంటుంటారు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, ఈ బ్లాక్ హెడ్స్ ను నివారించడంలో పెద్ద కష్టమైన పనేమి కాదు. బ్లాక్ హెడ్స్ అంటే? మన చర్మం క్రింద సెబాసియస్ గ్లాండ్స్ ఉంటాయి. యుక్త వయస్సులో ఈ గ్లాండ్స్ చురుకుగా పనిచేస్తాయి. సెబమ్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. దీని వల్ల చర్మం పై ఎర్రగా లేదా నల్లగా ఉండే పింపుల్స్ ఏర్పడతాయి. నల్లగా ఉండే పింపుల్స్ ను బ్లాక్ హెడ్స్ అంటారు. ఇవి మామూలు పింపుల్స్ కన్నా పెద్దగా ఉంటాయి. మన చర్మానికి అవసరమైన పోషక పదార్తాలను అందచేసే క్రమంలో రక్తం నుంచి అదనంగా ఉండే నూనె పదార్థాలు, సెబమ్ మరికొన్ని రసాయన పదార్థాలు వెలువడతాయి. ఇవి చర్మ రంధ్రాల నుంచి బయటకు వస్తాయి. బటయ ఉండే దుమ్ము, ధూళి కూడా ఇవి ఏర్పడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇవి ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా చేరుతుంది. ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఈ సమస్య మరింతగా ఉంటుంది. ముఖాన్ని అందవిహీనంగా మార్చిన బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోవడం ఇలా. బ్లాక్ హెడ్స్ ఉన్న వారు సలిసిలిక్ యాసిడ్ ఉన్న పేస్ వాష్ తో క్రమం తప్పకుండా ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. నిపుణుల సలహా మేరకు బెంజోయిల్ పెరాక్సైడ్ తో కూడిన క్రీములు వాడినా ఫలితం ఉంటుంది. ప్రతి వారం సీసాల్ట్ తో కూడిన స్ర్కబ్ తో ముఖాన్ని శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఓట్ మీల్ తో చర్మం శుభ్రం చేసుకొన్నా డెడ్ స్కిన్ సెల్స్ తొలగి పోతాయి. ముల్లంగి విత్తనాలను నీటిలో వేసి పేస్ట్ లా చేసి దానికి బ్లాక్ హెడ్స్ పై పట్టించాలి. బాగా ఆరిన తర్వాత ముఖాన్ని శుభ్రపరచాలి. ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. బాదంపొడి, ముల్తానీ మట్టి, గ్లిజరిన్ సబ్బు కూడా బ్లాక్ హెడ్స్ నివారణకు బాగా పనిచేస్తాయి. సూచన: బ్లాక్ హెడ్స్ త్వరగా తొలగించుకోవాలనే ఆత్రంతో వాటిని తరచూ రుద్దడం, గిల్లడం ద్వారా తొలగించే ప్రయత్నం కూడా చేయకండి. ఈ ప్రయత్నాల వల్ల బ్లాక్ హెడ్స్ పై ఉన్న రంధ్రాలు మరింత పెద్దవి అవుతాయి. బ్లాక్ హెడ్స్ సంఖ్య కూడా బాగా పెగరుతుంది.
