side effects of lemon juice

Hello Veiwers Welcome to MMS DESIGNER.
అతిగా నిమ్మరసం తాగటం వలన కలిగే దుష్ప్రభావాలు
విటమిన్ 'C' అధికంగా కలిగి ఉండే నిమ్మ చాలా రకాలుగా ప్రయోజనాలను చేకూరుస్తుంది అవునా! కానీ నిమ్మ వలన కూడా దుష్ప్రభావాలు ఉన్నాయండోయ్! నమ్మకం కలగటం లేదా అయితే ఇది చదవండి.
నిమ్మ వలన కలిగే ప్రయోజనాల గురించి మనం తెలిసిందే. విటమిన్ 'C' అధికంగా కలిగి ఉందనే నిమ్మ సారిన్ స్థాయిలో ఆరోగ్యానికి మంచిదే. కానీ అధిక మొత్తంలో విటమిన్ 'C' తీసుకోవటం వలన అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిలో ముఖ్యమైనవి ఇక్కడ తెలుపబడ్డాయి.
అల్సర్
జీర్ణాశయంలో ఆమ్ల గాడతలు అధికం అవటం వలన అల్సర్ లు కలుగుతాయి. అలాగే ఆమ్ల గాడత కలిగి ఉండే నిమ్మరసాన్ని తీసుకోవటం వలన పొట్టలో ఆమ్ల గాడతలు పెరిగి, జీర్ణాశయ మరియు పేగుల అంతర్గత పొర దెబ్బ తింటుంది. కావున అధిక మొత్తంలో నిమ్మరసం కూడా అల్సర్ కు గురి చేస్తుంది.
పిత్తాశయం, మూత్రపిండాలలో రాళ్లు
నిమ్మరసాన్ని తాగటమే కాకుండా వంటలలో కూడా వాడతుంటాము అవునా! నిమ్మ తోక్కలలో ఆక్సాలేట్ అధికంగా ఉంటుంది. నిమ్మకాయని పిండినపుడు ఈ మూలకం కూడా ఆహరం లేదా నిమ్మరసం ద్వారా మన శరీరంలోకి చేరుతుంది. ఈ ఆక్సలేట్ మన శరీరంలో కాల్షియం శోషణకు అంతరాయం ఏర్పరచి, పిత్తాశయం, మూత్రపిండాలలో రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.
దంత సమస్యలు
నిమ్మరసం లేదా నిమ్మ నేరుగా దంతాలకు తాకటం వలన వాటిలో ఉండే సిట్రిక్ ఆసిడ్ మరియు ఆస్కార్బిక్ యాసిడ్ దంతాల పై పొర అయినట్టి ఎనామిల్ ను ప్రమాదానికి గురి చేస్తాయి. ఫలితంగా, క్యావిటీ, దంత కణాలు దెబ్బతినటం లేదా దంతాల రంగు మారటం మరియు దంతక్షయం వంటి సమస్యలు కలుగుతాయి
కడుపులో కలతలు
మన జీర్ణాశయంలో అన్ని ఆహార పదార్థాలు జీర్ణం అవవు. ఉదాహహరణకు- నిమ్మరసాన్ని ఇతర ఆహార పదార్థాలతో తీసుకోవటం వలన త్వరగా జీర్ణం అవుతుంది కానీ, నేరుగా కేవలం నిమ్మరసాన్ని తీసుకోవటం వలన జీర్ణాశయంలో ఆమ్ల గాడతలు అధికం అవటం వలన జీర్ణాశయంలో అవాంతరాలు ఏర్పడి, కడుపులో కలతలకు కారణం అవుతుంది.
Disclaimer +
ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి MMS DESIGNER (Health tips) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా video lo ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు
