Do-not ignore this Your smartphone is killing you slowly

MMS Designer
MMS Designer
Sep 11, 2026

Hello Viewers Welcome to MMS DESIGNER.
ఈ మద్య కాలంలో స్మార్ట్ ఫోన్స్ వినియోగిస్తున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. ఎంతగా అంటే భోజనం చేసే సయంలో, ఆటలాడే సమయంలో, సాధారణ కార్యకలాపాలు లేదా సంభాషణల సమయంలో స్మార్ట్ ఫోన్లతో ఎక్కువ సమయం గడుపుతుంటారు? ఇందులో మీరు కూడా ఒకరైతే ఖచ్చితంగా ఇది మీ పిల్లల్లో ప్రవర్తనలో మార్పులు తీసుకొస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఈ మద్యనే జరిపిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం టెక్నాలజీ నార్మల్ లేదా తక్కువగా ఉన్నా అది పిల్లల ప్రవర్తనలో చాలా మార్పులు తీసుకొస్తుందని పరిశోధకులు సూచిస్తున్నారు. స్మార్ట్ ఫోన్స్ ను పిల్లలు ఎక్కువగా ఉపయోగించడంలో పిల్లల్లో సున్నితత్వం, హాట్ టెంపర్, హైపర్ యాక్టివ్, వైనింగ్ లక్షణాలు కనబడుతాయి.
రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో డిజిటల్ టెక్నాలజీ వల్ల తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్స్ కు బాగా అలవాటు పడటం వల్ల తల్లిదండ్రులకు, పిల్లలకు మద్య సంబంధ బాంధవ్యాలు దూరం అవుతున్నాయని పరిశోధనల్లో సాక్ష్యాలతో నిరూపించబడ్డాయని ఇలియస్లోని ఇల్లినాయిస్ స్టేట్ యూనివర్సిటీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రాండన్ టి.ఎంసి మక్ డానియల్ చెప్పారు.
ఎప్పుడైతే తల్లిదండ్రులు మొబైల్ టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగిస్తారో, అప్పుడు వారు పిల్లల మీద చూపించే ప్రేమ, వారిచ్చే సమాధానాల వల్ల, వారు చూసుకునే విధానం, ప్రవర్తన వల్ల పిల్లల్లో మార్పులు వస్తాయి.